పిల్లిని కుక్కలతో చంపించిన వ్యక్తికి 3 నెలల పాటు ' జూ ' శుభ్రం చేయాలని తీర్పు
- March 17, 2017
" పిల్లిని చంపితే ...మహా పాతకమంటారు " మరి కుక్కల చేత చంపిస్తే పెద్దగా శాపం తగలదేమో బహుశా అనుకోని ఉంటాడా సైకో ..అంతటితో ఆగక ఆ భీకరమైన వీడియోని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసి...తనంతట తాను చనిపోయిన పిల్లి ఉసురు తగిలేలా చేసుకొన్నాడు. దుబాయ్‌లో ఒక వ్యక్తి తాను పెంచుకుంటున్న కోడిని, ఓ పిల్లి తినేసిందని దాన్ని హతమార్చేడు .కోడిని తిన్న పిల్లిని అతడు ఒక బోనులో బంధించాడు. దాన్ని ఒక ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లాడు. నాలుగు కుక్కలను సైతం అక్కడికి తీసుకువచ్చాడు. ఆ నాలుగు కుక్కలు ఒక్కసారే పిల్లిపై దాడి చేసి చంపి తింటుంటే అక్కడే కూర్చుని తాపీగా వీడియో తీశాడు. అక్కడితో ఊరుకోకుండా ఆ వీడియోను తాను ఏదో సాహసకార్యం చేసినట్లుగా మాదిరిగా ఫేస్బుక్లో,ట్విట్టర్లో పలువురికి పోస్టు చేశాడు. అది కాస్త వైరలయ్యింది. దాంతో అందరూ ఈ దారుణ సంఘటనపై విమర్శిస్తూ ఆ వ్యక్తి చేష్టలను ఖండించారు. ఈ విషయం చివరకు దుబాయ్ ప్రధాని రషీద్ అల్ ముక్తమ్ దృష్టికి వెళ్లింది. దీనితో ఆయన ఆగ్రహించి తక్షణమే ఆ సైకోని అరెస్ట్ చేయమని పోలీసుశాఖను ఆదేశించాడు. అలాగే ఆ భయానక వీడియోని ఎందరికో షేర్ చేసిన గల్ఫ్ పౌరునికి మరియు ఇద్దరు ఆసియా దేశస్థులు అత్యుత్సాహంతో విస్తృతంగా సామాజిక మీడియాలో ఆ వీడియోని షేర్ చేసినందుకు వారూ ఖైదు చెయ్యబడ్డారు. జంతువులపై క్రూరత్వంని నిరోధించడానికి ఇటీవల అమలులోకి తెచ్చిన చట్టం ప్రకారం జైలులో ఒక సంవత్సరం లేదా 200,000 దిర్హాములు ( 54,500 డాలర్లు ) జరిమానా విధించనున్నారు. అలాగే అతడు మూడు నెలలపాటు రోజుకి నాలుగు గంటలచొప్పున దుబాయ్ జూ మొత్తం శుభ్రం చేయాలని శిక్షని విధించాడు. మూగ జీవులను హింసించడం నేరామని అది ఇస్లాం ధర్మాలను ఉల్లంఘించడమేనని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







