కాకరకాయ లో ఏముంది?

- March 17, 2017 , by Maagulf
కాకరకాయ లో ఏముంది?

కాకరకాయలో....
కొవ్వు - 0.17 గ్రాములు, 
పీచు- 2.80 గ్రాములు,
నియాసిన్ - 0.400 మి.గ్రాములు, 
క్యాల్షియం - 10. మి.గ్రాములు, 
సోడియం - 5 మి. గ్రాములు,
పొటాషియం -296 మి.గ్రా వున్నాయి.
 
కాకరలో కెలోరీలు తక్కువ. ఇందులో 80 శాతం నుంచి 90 శాతం వరకు తేమ ఉంటుంది. బి1, బి2, బి3, బి5, బి6, సి విటమిన్లతో పాటు పొటాషియం, మేగ్నీషియం, సోడియం, ఫాస్పరస్ వంటి ధాతువులు వున్నాయి. ఆకుకూరల్లో ఉన్న క్యాల్షియం కంటే కాకరలో రెండింతలు అధికంగా క్యాల్షియం ఉంటుంది. ఇకపోతే కాకర పేగు సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. నెలసరిని క్రమం చేయడంతో పాటు బరువు నియంత్రిస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్‌తో పాటు శరీరంలో క్యాన్సర్ కణాలను దరిచేరనీయకుండా చేస్తుంది.     
 
అయితే కాకరను అతిగా తినకూడదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాకరను నెలకు మూడుసార్లో వారానికి ఒకసారో మాత్రమే తీసుకోవాలి. గర్భిణీలు, పిల్లలకు పాలుపట్టే మహిళలు కాకరను మితంగానే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com