భారీ వరదలు పెరూలో
- March 17, 2017
- 12 మందికి పైగా మృతి
పెరూలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పరవళ్ళు తొక్కుతున్నాయి. ఈ వరదల్లో 12 మందికి పైగా మరణించారు. పెరూ రాజధాని లిమాలో కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. బురద నీరు వీధుల్లోకి, నివాసాల్లోకి ప్రవేశించింది. దాదాపు 10 లక్షల మంది నివసించే ఈ నగరం గతంలో ఇలాంటి విపత్తులను ఎన్నడూ చవిచూడలేదు. ఈ వరదల్లో ఒక మహిళ కొట్టుకు పోతూ ఎట్టకేలకు సురక్షితంగా బయట పడిన ఘటనతో సహా కొన్ని దృశ్యాలను స్ధానికులు తమ సెల్‌ఫోన్‌లలో బంధించి ఇతరులతో పంచుకున్నారు. కొన్ని ఫామ్ హౌస్‌లలో నిర్మించిన కట్టడాలతో పాటు, పశువులు కూడా వరదల్లో కొట్టుకు పోయాయి.
వరదల్లో నివాసాలు కోల్పోయిన వారికి కొత్తవాటిని నిర్మించి ఇవ్వాలని పెరూ అధ్యక్షులు పెడ్రో పాబ్లో కుజిన్స్కి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







