జయ శోభన్‌బాబు కొడుకునంటూ కోర్టుకు ఫేక్ పత్రాలతో
- March 17, 2017
జయలలిత ఆస్తుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా.. జయ తనయుణ్ని నేనే అంటూ కృష్ణమూర్తి అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. దానికి సాక్ష్యాలంటూ కొన్ని డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించాడు. అయితే ఆ పత్రాలన్నీ నకిలీవంటూ కోర్టు అతనికి స్ట్రాంగ్ వార్నింగిచ్చింది.
జయలలిత కుమారుణ్ని తానేనంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన క్రిష్టమూర్తి అనే వ్యక్తిపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వాదనకు అతను సమర్పించిన పత్రాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అవి నకిలీవని ఎల్‌కేజీ కుర్రాడు కూడా చెప్పేస్తాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కృష్ణమూర్తి తాను జయలలిత, శోభన్‌బాబుల కుమారుడిని అంటూ వాదిస్తున్నాడు. తాను 1985లో జన్మించానని.. ఏడాది తర్వాత ఈరోడ్‌లోని వసంతమణికి తనను దత్తత ఇచ్చేశారంటున్నాడు. ఇందుకు రుజువులుగా.. తనను వసంతమణికి దత్తత ఇస్తున్న ఫొటోలను, ఎంజీఆర్ సాక్షి సంతకం చేసిన దత్తత పత్రాలను కోర్టుకు సమర్పించాడు. అయితే కృష్ణమూర్తి సమర్పించిన పత్రాలన్నీ ఫేక్ డాక్యుమెంట్లని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నై సిటీ కమిషనర్‌కు ఒరిజినల్ పత్రాలు సమర్పించాలని ఆదేశించింది. కోర్టుతో ఆడుకోవద్దని హెచ్చరించింది. ఇప్పటికే జయలలితకు అసలైన వారసులు ఎవరనే వివాదం నడుస్తోంది. ఇంతలో కొత్తగా కృష్ణమూర్తి తెరపైకి వచ్చాడు. అతను చెబుతున్న దానిలో నిజమెంత అనేది పోలీసుల విచారణలో తేలనుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







