ప్రవాసీయుల డబ్బు బదిలీ పర్యవేక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది : ఎంపీ

- March 18, 2017 , by Maagulf
ప్రవాసీయుల డబ్బు బదిలీ పర్యవేక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది : ఎంపీ

కువైట్ : ప్రవాసీయుల భారీ డబ్బు బదిలీలపై కఠినమైన పర్యవేక్షణ విధించాలని ఎంపి ఖలీల్ అల్ సాలెహ్ అధికారులకు పిలుపునిచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, విదేశీయుల ద్వారా డబ్బు బదిలీ 2010 - 2014 మధ్య కాలంలో  21.2 బిలియన్ కువైట్ దినార్లు చేరుకుంటుందని తెలిపారు. ప్రవాసీయులు డబ్బు బదిలీ చేసినపుడు ఏదైనా పన్నులు లేదా సుంకాలు విధించే ఉద్దేశ్యం ఉందా అని ఆర్థిక శాఖను ఎంపీ కోరారు. ఇటీవల, పలువురు ఎంపీలు కువైట్ నుండి డబ్బు ప్రవాహంపై తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. వలస వెళ్ళినవారు 'డబ్బు బదిలీలు పన్నులు సక్రమంగా కట్టేవిధంగా చూడాలని  పిలుపునిచ్చారు. గత వారం, ఎంపి సఫా అల్ హషెం ప్రవాస డబ్బు బదిలీలపై ఐదు శాతం పన్నువిధించాలని ప్రతిపాదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com