కాల్పులు పారిస్ విమానాశ్రయంలో
- March 18, 2017
ఆగంతకున్ని మట్టుబెట్టిన భద్రతా బలగాలు
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఓర్లీ విమానాశ్రయంలో శనివారం కాల్పులు కలకలం స ష్టించాయి. దీంతో, విమానాశ్రయంలోని ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పలు విమాన సర్వీసులను నిలిపివేసినట్టు అధికారులు చెప్పారు. ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి పీర్ హెన్రీ బ్రాండెట్ తెలిపిన వివరాల ప్రకారం...విమానాశ్రయ అధికారి దగ్గర నుంచి ఓ వ్యక్తి ఆయుధాన్ని లాక్కున్నాడు. అనంతరం ఓ మహిళను హతమారుస్తానని బెదిరించాడు. దీంతో, అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆగంతకునిపై కాల్పులు జరిపారు. నిందితున్ని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.
మృతుడి వివరాలు తెలియరాలేదు. కాల్పుల శబ్దంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విమానాశ్రయంలోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఘటనకు పాల్పడ్డ వ్యక్తికి ఉగ్రవాదంతో సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారని హెన్రీ తెలిపారు. కాగా, పారిస్‌లో ఇటీవలి కాలంలో వరుస ఆత్మాహుతి దాడి ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
ఈనేపథ్యంలో ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, శనివారం తెల్లవారుజామున స్టెయిన్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ధ్రువపత్రాలను పరిశీలించేందుకు ప్రయత్నించగా పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యాడు.
ఈ ఘటనలో పోలీస్ సిబ్బంది ఒకరు గాయపడ్డారు. కాగా, స్టెయిన్‌లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి, పారిస్ విమానాశ్రయంలో కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తి ఒక్కడేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన ఓర్లి విమానాశ్రయం పారిస్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







