సునిల్ గ్రోవర్ చెంప చెల్లు మనిపించిన కపిల్ శర్మ

- March 19, 2017 , by Maagulf
సునిల్ గ్రోవర్ చెంప చెల్లు మనిపించిన కపిల్ శర్మ

ద కపిల్ శర్మ షో’లో సహ హాస్యనటుడు సునిల్ గ్రోవర్ పై కపిల్ శర్మ చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. గత వారంలో వీళ్లిద్దరూ ఆస్ట్రేలియా నుంచి ముంబై వస్తుండగా విమానంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. ‘ద కపిల్ శర్మ షో’ నిమిత్తం కపిల్ తన టీమ్ తో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు విమానంలో కపిల్, సునిల్ కి మధ్య చిన్న వాగ్వాదం చోటు  చేసుకున్నట్లు సమాచారం. అందరూ చూస్తుండగానే తో కపిల్ అసభ్యంగా మాట్లాడిన సునిల్, అతనిపై దాడి చేశాడు. బాగా మద్యం సేవించి ఉన్న కపిల్ కేకలు వేస్తుండటంతో విమాన సిబ్బంది అతని చేతులు కట్టేసి మరీ, సీటులో కూర్చోబెట్టారు. సునిల్ తన పనిలో తానుండగా కపిల్ దాడి చేశాడని, అందరు చూస్తుండటాన్ని గమనించిన సునిల్ సైలెంట్ గా కూర్చుండిపోయాడని తోటి ప్రయాణికులు మీడియాకు తెలిపారు. కాగా, కపిల్, సునిల్ మంచిమిత్రులు. ‘కామెడి నైట్స్ విత్ కపిల్ షో’తో వాళ్లిద్దరూ మంచి పేరు తెచ్చుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com