సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో 50 గంటలు మద్యం బంద్..

- September 26, 2015 , by Maagulf
సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో 50 గంటలు మద్యం బంద్..

గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో జంటనగరాల పరిధిలోని అన్ని మద్యం షాపులు మూసిఉంచాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. శనివారం ఉదయం 10 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటలవరకు సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో మద్యం దుకాణాలు మూసేయాలని ఆదేశించినట్లు సైబరాబాద్ కమిషనర్ సి.వి. ఆనంద్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిమజ్జన మహోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. అటు ఇతర జిల్లాల్లోనూ ఆయా ఎస్సీలు మద్యం అమ్మకాలపై నిషేధాజ్ఞలు జారీచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com