ఇసా టౌన్ మార్కెట్ ను అలుముకున్న మంటలు

- March 19, 2017 , by Maagulf
ఇసా టౌన్ మార్కెట్ ను అలుముకున్న మంటలు

మనామా:ఇసా టౌన్ లోని సాంప్రదాయ మార్కెట్ వద్ద ఆదివారం వేకువజామున మంటలు రాజుకొని , ఎనిమిది దుకాణాలు తగలబడ్డాయి. ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టాలు జరగలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపింది. సివిల్ డిఫెన్స్ అగ్నిమాపక దళం వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుంది. వారి చర్యతో ఎగిసిపడిన మంటలు సమీపంలోని దుకాణాలకు వ్యాప్తి చెందకుండా నియంత్రించారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో అగ్నిజ్వాలల తీవ్రంగా చుట్టుముట్టాయి. ఈ అగ్ని ప్రమాదంలో దుకాణాల్లో అనేక ఫర్నిచర్, గృహ అంశాలు మరియు ఆహార పదార్ధాలు  సర్వనాశనమాయ్యాయని పేర్కొన్నారు." సివిల్ డిఫెన్స్ ఇసా టౌన్ లో సాంప్రదాయ మార్కెట్లో అగ్ని జ్వాలలతో పోరాడుతుంది. సంబంధిత అధికారుల సంఘటన స్థలం వద్ద ఉన్నారని.ఈ అగ్ని ప్రమాదానికి అసలు కారణం కనుగొనేందుకు అధికారులు పరిశోధిస్తున్నారు. " ట్విట్టర్ లోఆంతరంగిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com