వినియోగదారుల కోసం ఈద్ కలెక్షన్స్

- September 26, 2015 , by Maagulf
వినియోగదారుల కోసం ఈద్ కలెక్షన్స్

ప్రత్యేక ఆఫర్స్తో, ప్రమోషనల్ ఈవెంట్స్తో వినియోగదారుల్ని ఈద్ సందర్భంగా ఆకట్టుకునేందుకు వివిధ సంస్థలు పోటీ పడ్డాయి. మార్కెట్లు వినియోగదారుల సందడితో కొత్త కళను సంతరించుకున్నాయి. హైపర్ మార్కెట్స్, ఉపకరణ దుకాణాలు, నగలు, లగ్జరీ ఆటో మొబైల్స్ దుకాణాలు వినియోగదారుల్ని ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్స్తో సిద్ధమయ్యాయి. ఆటోమొబైల్ రంగంలో ఏడాది పాటు ఇన్స్యూరెన్స్ సౌకర్యాన్ని ఉచితంగా అందించడం, సంవత్సరం పాటు ఉచిత సర్వీసింగ్ సౌకర్యం కల్పించడం వంటి ఆఫర్లతో వినియోగదారుల్ని ఆకట్టుకున్నాయి. ఓ ఆటోమొబైల్ డిస్ట్రిబ్యూటర్ అయితే రెండేళ్ళపాటు ఉచిత సర్వీస్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈ ఆఫర్లు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే సగానికి పైగా అమ్మకాలు జరిగిపోయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 318 ఐ బిఎండబ్ల్యు 2016 మోడల్ కేవలం 99,990 ఖతారీ రియాల్స్కే ఆఫర్లో లభ్యమవుతోంది. మామూలుగా అయితే దీని విలువ 1,35,00 ఖతారీ రియాల్స్. దాంతోపాటుగా ఉచితంగా 55 అడుగుల కర్వ్డ్ ఎలజీ ఓఎల్ఈడీ టీవీ కూడా లభించనుంది. బర్వా సిటీలోని లులు హైపర్ మార్కెట్, లక్కీ డ్రా కూపన్లను ప్రకటించింది. ఈ కూపన్లలో విజేతలకు ఇ 200 క్లాసిక్ బెంజ్ కార్ బహుమతిగా లభించనుంది. హోటళ్ళు, ఇన్ హౌస్ రెస్టిరెంట్లు కూడా ఓపెన్ బఫెట్ తదితర ఆఫర్లను ప్రకటించాయి. స్మార్ట్ ఫోన్లు, హెచ్డి టీవీలు, ఓవెన్స్, మరియు వంట పరికరాలు తక్కువ ధరలకే హైపర్ మార్కెట్లలో లభ్యమవుతున్నాయి. 


--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com