కామెల్‌ కాన్వాయ్‌లో ఉల్లాసంగా ఉత్సాహంగా

- March 20, 2017 , by Maagulf
కామెల్‌ కాన్వాయ్‌లో ఉల్లాసంగా ఉత్సాహంగా

తమ పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో 9 కిలోమీటర్ల మేర కామెల్‌ కాన్వాయ్‌లో 400 మంది పాల్గొన్నారు. నార్త్‌ బతినా గవర్నరేట్‌ పరిధిలోని ఖబౌరాలో గల వాడి అల్‌ హవ్‌స్‌నా నుంచి ఈ ట్రిప్‌ ప్రారంభమయ్యింది. రిటైర్డ్‌ మేజర్‌జనరల్‌ సైద్‌ బిన్‌ నాజర్‌ అల్‌ సల్మి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుల్తానేట్‌ పరిధిలోని పలు గవర్నరేట్స్‌కి చెందిన పలువురు ఈ కాన్వాయ్‌లో పాల్గొన్నారని నాజర్‌ అల్‌ హోస్ని అనే పార్టిసిపెంట్‌ చెప్పారు. వీరిలో యూకే మరియు యుఎస్‌ నుంచి వచ్చిన విదేశీ ప్రతినిథులు కూడా ఉన్నారు. 9 కిలోమీటర్ల ఈ యాత్రను పూర్తి చేయడానికి 3 గంటల సమయం పట్టింది. అత్యంత క్లిష్టతరమైన ఈ రవాణా మార్గంలో తమ పూర్వీకులు పడ్డ కష్టం గురించి యాత్రలో పాల్గొన్నవారంతా తెలుసుకున్నారు. డొమెస్టిక్‌ టూరిజంని ప్రమోట్‌ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడ్తాయనీ, ఈ టూర్‌ ప్రతి యేడాదీ కొనసాగించాలని తాము కోరుకుంటున్నామని హోస్నీ చెప్పారు. కార్‌లో ముందుగా గమ్యాన్ని చేరుకున్న ఇద్దరు ఒమనీయుల్ని మేజర్‌ జనరల్‌ సల్మి సత్కరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com