రోజర్ ఫెదరర్ ఆరోస్థానానికి
- March 21, 2017
ఏటీపీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో స్విస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. 10వ స్థానంలో ఉన్న ఫెదరర్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు. ఫెదరర్ తాజాగా ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టైటిల్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
టోర్నీలో భాగంగా క్వార్టర్స్‌లో ఫెదరర్.. తనకన్నా మెరుగైన క్రీడాకారుడు, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. తాజా ర్యాంకింగ్స్‌లో ఫెదరర్ ఆరో స్థానంలో కొనసాగుతుండగా... నాదల్ ఏడో స్థానంలో నిలిచాడు. ఆండీ ముర్రే, నొవాక్ జకోవిచ్, వావ్రింకా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
సెరెనాను వెనక్కి నెట్టిన కెర్బర్
జర్మనీ క్రీడాకారిణి కెర్బర్ తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇండియన్ వెల్స్ మాస్టర్ టోర్నమెంట్‌లో నాలుగో రౌండ్‌లో కెర్బర్ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇండియన్ వెల్స్ టోర్నీలో సెరెనా పాల్గొనలేదు. దీంతో కెర్బర్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







