అబుదాబి లోని మృతులకు డిఎన్ఏ పరీక్ష
- March 21, 2017
అబుదాబిలో జనవరిలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు తెలంగాణ వాసుల్లో ఒకరిని నిర్మల్కు చెందిన పిట్టల రవీందర్గా ఇప్పటికే గుర్తించగా, మరో ఐదుగురిని అబుదాబి ప్రభుత్వం గుర్తించాల్సి ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. మిగిలిన నాలుగు మృతదేహాలను గుర్తించేందుకు మృతుల బంధువులకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున వారిని అబుదాబి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని కెటిఆర్ జిఎడి అధికారులను ఆదేశించారు. అవసరమైన పాస్పోర్టు, వీసాలను సమకూర్చాలని నిర్మల్, నిజామాబాద్ కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు, వారికి సహాయకులుగా మరో ఇద్దరు కలిపి మొత్తం ఆరుగురు అబుదాబి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఈ నెల 21న అబుదాబికి వెళ్లేందుకు విమాన టిక్కెట్లు కూడా బుక్ చేసినట్లు తెలిపారు.
--సాయికృష్ణ యాదవ్
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







