కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌, జరీమానాలు

- March 21, 2017 , by Maagulf
కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌, జరీమానాలు

మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, కొత్త రూల్స్‌ని జారీ చేసింది. ట్రాఫిక్‌ చట్టాలకు సంబంధించి అమెండ్‌మెంట్స్‌ని చేయడం జరిగింది. ఈ అమెండ్‌మెంట్స్‌ ప్రకారం, వాహనాల్లో ప్రయాణీకులు సీటుబెల్టు పెట్టుకోకపోతే జరీమానా విధించబడుతుంది. నాలుగేళ్ళలోపు చిన్నారులకు ఖచ్చితంగా స్పెషల్‌ చైల్డ్‌ సీట్స్‌ ఉండాలి. 10 ఏళ్ళ పైబడిన చిన్నారులు ముందు సీట్లలో కూర్చోవచ్చు. అయితే వారు ఖచ్చితంగా 145 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. అక్రమంగా ప్రయాణీకుల్ని తీసుకెళ్ళినపక్షంలో 3,000 దిర్హామ్‌ల జరీమానా విధించబడుతుంది, అలాగే 24 బ్లాక్‌పాయింట్స్‌ కూడా తప్పవు. వాహనం నెల రోజులపాటు స్వాధీనం చేసుకోబడ్తుంది. డ్రైవర్‌ మాత్రమే కాకుండా, వాహనంలో ప్రయాణిస్తున్నవారంతా సీటు బెల్టు పెట్టుకోవాల్సిందే. పబ్లిక్‌ రోడ్స్‌పై ట్రైసైకిల్‌, క్వాడ్‌ బైక్స్‌ని నడిపితే 3,000 దిర్హామ్‌ల జరీమానా, 90 రోజుల ఇంపౌండ్‌మెంట్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com