తల తెగుతుంది సెక్సీ' కామెంట్ చేస్తే

- March 21, 2017 , by Maagulf
తల తెగుతుంది సెక్సీ' కామెంట్ చేస్తే

అక్షయ్‌కుమార్‌ భార్య, హీరోయిన్ ట్వింకిల్‌ ఖన్నా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇటీవల టీవీఎఫ్‌ సీఈవో అరునబ్‌ కుమార్‌ తన కంపెనీలో పనిచేస్తున్న ఓ అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దిన్ని ఆయన సమర్ధించుకున్నాడు కూడా. 'నేను సింగిల్‌. నాకు ఏ యువతైనా అందంగా కనిపిస్తే మీరు సెక్సీగా ఉన్నారు అని కాంప్లిమెంట్‌ ఇస్తా. అది తప్పా?' అంటూ సెలవిమ్చాడు.
దీనిపై ట్వింకిల్‌ ఖన్నా తన ట్విట్టర్ లో ఘాటుగా స్పదించింది.'పడక గదిలో సెక్సీగా ఉన్నావు అని చెప్పొచ్చు. కానీ పని చేసేచోట ఓ అమ్మాయిని సెక్సీగా ఉన్నావు అనడం సమంజసం కాదు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
లేకపోతే తల తెగిపోతుంది' అంటూ ఓ ఘాటు కామెంట్ చేసింది ట్వింకిల్‌ . ఇప్పుడు ట్వింకిల్‌ చేసిన ట్వీట్ పై సర్వాత్ర చర్చ జరుగుతోంది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. లైంగిక వేధింపుకు ఎంత భాదను కలిగిస్తాయో తెలుసు.
అందుకే అంత ఘాటుగా స్పదించా అని చెప్పుకొచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com