హయా వాటర్ - రక్తదాన శిబిరం
- March 21, 2017
సామాజిక బాధ్యతగా హయా వాటర్ సంస్థ బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సహకారంతో నిర్వహించింది. బైత్ హయా ప్రాంతంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సంస్థ కార్పొరేట్ కమ్యూనికేషన్ మేనేజర్ హనన్ యూసుఫ్ బలుషి మాట్లాడుతూ, హెల్త్ అవేర్నెస్ని పెంచే క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాంటి రక్తదాన శిబిరాల్ని తమ సంస్థ నిర్వహిస్తోందని చెప్పారాయన. ఈ కార్యక్రమంలో సంస్థకు చెందిన సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని అన్నారాయన. రక్తదానం చేయడం ద్వారా ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపినట్లవుతుందని ఇదొక సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ రక్తదానం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు హనన్. రోడ్డు ప్రమాదాల్లో గాయపడేవారికి, అత్యవసర ఆపరేషన్లు అవసరమైనవారికి రక్తం ఎంతో అవసరమని అలాంటివారికోసం రక్తదానం చేయాలన్న అవగాహన ప్రతి ఒక్కరిలోనూ పెరగాలని హనన్ చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







