హయా వాటర్‌ - రక్తదాన శిబిరం

- March 21, 2017 , by Maagulf
హయా వాటర్‌ - రక్తదాన శిబిరం

 సామాజిక బాధ్యతగా హయా వాటర్‌ సంస్థ బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ని మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ సహకారంతో నిర్వహించింది. బైత్‌ హయా ప్రాంతంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సంస్థ కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ మేనేజర్‌ హనన్‌ యూసుఫ్‌ బలుషి మాట్లాడుతూ, హెల్త్‌ అవేర్‌నెస్‌ని పెంచే క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాంటి రక్తదాన శిబిరాల్ని తమ సంస్థ నిర్వహిస్తోందని చెప్పారాయన. ఈ కార్యక్రమంలో సంస్థకు చెందిన సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని అన్నారాయన. రక్తదానం చేయడం ద్వారా ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపినట్లవుతుందని ఇదొక సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ రక్తదానం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు హనన్‌. రోడ్డు ప్రమాదాల్లో గాయపడేవారికి, అత్యవసర ఆపరేషన్లు అవసరమైనవారికి రక్తం ఎంతో అవసరమని అలాంటివారికోసం రక్తదానం చేయాలన్న అవగాహన ప్రతి ఒక్కరిలోనూ పెరగాలని హనన్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com