సూర్య శివాజీ గణేషన్ గా

- March 23, 2017 , by Maagulf
సూర్య శివాజీ గణేషన్ గా

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సంసిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. అశ్వనీదత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే.. సెట్స్‌పైకి తీసుకెళ్తారు. ఈ సినిమా కోసం సమంత, కీర్తి సురేష్‌లను కథానాయికలుగా ఎంచుకొన్నారు.
ఇప్పుడీ సినిమాకి గురించి ఓ ఆసక్తికరమైన విషయం వినిపిస్తుంది. సావిత్రి కథ అంటే శివాజీ గణేషన్ గురించీ చెప్పాల్సిందే. ఆ పాత్రలో తమిళ నటుడైతే బాగుంటుందని భావిస్తున్నారు. అందుకోసం సూర్యని సంప్రదించిందట చిత్రబృందం. ఈ కథలో శివాజీ గణేశన్ పాత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకొన్న సూర్య తన నిర్ణయాన్ని ఇంకా చెప్పలేదని అంటున్నారు.
ఒకవేళ ఈ సినిమా ని సూర్య చేస్తే.. సూపర్ క్రేజ్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com