31 లోగా ఆస్తులు వెల్లడించకపోతే కఠిన చర్యలు
- March 25, 2017
నల్లకుబేరులు స్వచ్ఛందంగా తమ ఆస్తులు వెల్లడించాలని, లేకపోతే చింతించక తప్పదని ఐటీ శాఖ హెచ్చరించింది. పీఎంజీకేవై పథకం కింద ఆస్తులు వెల్లడించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఐటీ శాఖ హామీ ఇచ్చింది. ఆదాయాన్ని వెల్లడించని డిఫాల్టర్ల పేర్లను ఈడీ,సీబీఐ వంటి జాతీయ సంస్థలకు తెలియజేస్తామని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. డిఫాల్టర్లపై బినామీ లావాదేవీల చట్టం కూడా ప్రయోగిస్తామని ఆయన చెప్పారు. ఆదాయాన్ని వెల్లడించకుండా ఆధారాలు లేని డబ్బుతో దొరికిపోయిన వారికి 83.25 శాతం పన్ను విధిస్తామని, అధికారులు తనిఖీలు చేసి ఆధారాలు లేని ఆదాయాన్ని కనుగొంటే 107.25 శాతం పన్నుతో పాటు జరిమానా విధిస్తామని తెలిపారు. అధికారుల తనిఖీలలో కూడా ఆదాయాన్ని బహిర్గతం చేనివారికి జరిమానాతోపాటు 137.25 శాతం పన్ను విధిస్తామని చెప్పారు. ఒకవేళ ఉల్లంఘనలపై బినామీ చట్టాన్ని ప్రయోగిస్తే వారికి ఏడేండ్ల కఠిన కారాగారశిక్షతో పాటు ఐటీ చట్టం కింద ఆరోపణలు మోపే అవకాశం కూడా ఉంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







