రేపు పార్లమెంట్‌కు జీఎస్టీ బిల్లు
- March 26, 2017
కేంద్ర ప్రభుత్వం ఎంతో కీలకంగా భావిస్తున్న వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అనుబంధ బిల్లులను సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జీఎస్టీలో భాగమైన సీ-జీఎస్టీ, ఐ-జీఎస్టీ, యూటీ-జీఎస్టీ న్యాయ పరిహారం మొదలైనవి వాటిని లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై మార్చి 28న చర్చ జరిగే అవకాశం ఉంది. జీఎస్టీ అమలైతే ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ చట్టంలో ఉన్న వివిధ సెస్సులను రద్దు చేస్తారు. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన బిల్లులన్నీ జీఎస్టీ కిందకు వస్తాయి. ఈ బిల్లుపై చర్చ జరిగే సమయాన్ని, ఇతర విషయాలపై రేపు బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. మార్చి 29 లేదా 30లోపు జీఎస్టీ బిల్లుకు సభ ఆమోదం పొందేలా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 12వరకూ జరగనున్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







