ముగ్గురు మహిళలపై లైంగిక వేధింపులు రియాద్‌లో
- March 28, 2017పొట్టచేత పట్టుకొని ఉపాధి కోసం గంపెడాశలతో విదేశాల దారి పట్టిన ముగ్గురు మహిళలు, ఒక డ్రైవర్ సౌదీ అరేబియా రియాద్‌లో వేధింపులకు గురవుతున్నట్లు ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్ మంగళవారం విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ మూడేళ్ల క్రితం, నగరంలోని కాలాపత్తర్‌కు ఇద్దరు మహిళలు మార్చి మొదటివారంలో దూద్‌బౌలికి చెందిన ఏజెంట్ మాటలు నమ్మి బ్యూటీపార్లర్‌లో ఉద్యోగం కోసం రియాద్ వెళ్లగా అక్కడ యజమానురాలు మహా ఆయద్ టుర్కి అనాజి ఇన్ అల్ యుర్ముక్ వారిని తన ఇంట్లో పనిమనుషులను చేసింది. యజమానురాలు కుమారుడు గదిలో బంధించి లైంగిక¹ంగా హింసిస్తున్నారని బాధితులు ఫొటోలు, వీడియోలు, వాయిస్ మెయిల్స్ పంపించారని ఆయన పేర్కొన్నారు.
మూడేళ్లు దాటినా తిరిగి పంపించకుండా ప్రశ్నిస్తే దొంగతనం కేసుల్లో ఇరికించి స్థానిక పోలీసులకు అప్పగించేందుకు బెదిరిస్తున్నట్లు బాధితులు తెలిపినట్లు చెప్పారు. వీరితోపాటు 2016లో వెళ్లిన ఓ డ్రైవర్ కూడా ఉన్నాడని అతడ్ని సైతం వేధిస్తున్నారని విదేశాంగ శాఖ అధికారులు కలగజేసుకుని బాధితులను రక్షించాలని ఆయన మంత్రిని కోరారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక