స్పేస్‌ఎక్స్ రాకెట్, విజయవంతంగా పునర్వినియోగం
- March 31, 2017
అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సేవల ప్రైవేట్ కంపెనీ స్పేస్ ఎక్స్ అరుదైన ఘనత సాధించింది. ఒకసారి ఉపయోగించిన రాకెట్ ను మరోసారి విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది.
స్పేస్ ఎక్స్ కంపెనీ రాకెట్ ను ప్రయోగించిన తరువాత దానిని సురక్షితంగా మళ్లీ లాంచ్ ప్యాడ్ పై ల్యాండ్ అయ్యే విధంగా చేస్తోంది. ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు చేసింది. అయితే ఇప్పుడు అలా ఒకసారి ఉపయోగించి తిరిగి భూమికి చేరిన రాకెట్ ను మరోసారి విజయవంతంగా ప్రయోగించింది.
రాకెట్ ను పునర్వినియోగించడం ఇదే ప్రథమం. గురువారం ఫ్లోరిడా లోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా విజయవంతంగా సమాచారం ప్రసార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించింది.
ఈ విధానంతో అంతరిక్ష ప్రయోగాల ఖర్చు భారీగా తగ్గుతుంది.
రెండోసారి ఉపయోగించిన రాకెట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించి తిరిగి మళ్లీ అట్లాంటిక్ సముద్రంలోని డ్రోన్ షిప్ లాంచ్ ప్యాడ్ పై ల్యాండ్ అయింది. దీంతో నిపుణులు, శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు.
లక్సెంబర్గ్ కు చెందిన ఎస్ఈఎస్ కంపెనీ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు. రాకెట్ పునర్వినియోగంపై స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలోన్ ముస్క్ చాలా కాలంగా నిరంతర కృషి జరుపుతున్నారు. కార్లు, విమానాలు, వాహనాల మాదిరిగానే రాకెట్ భాగాలు కూడా తిరిగి ఉపయోగపడాలన్నదే తమ లక్ష్యమని ముస్క్ తెలిపారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







