యుఎఇ ప్రధాన రహదారి రెండు రోజుల పాటు మూసివేయనున్నారు
- March 31, 2017
ఖలీద్ సరస్సు ఎదురుగా ఉన్న అల్ మజాజ్-3 కార్నిష్ వీధిని పాక్షికంగా ఓ రెండు రోజులు పాటు మూసివేయనున్నట్లు షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) ఒక ప్రకటనలో తెలిపింది.అధికారిక సమాచారం మేరకు మూడు లైన్ల రహదారిలో ఉన్న రెండు దారులను నిర్వహణ పనుల నిమిత్తం రెండు రోజుల పాటు మూసివేయబడ్డాయి. సెంట్రల్ సూక్ అల్ లియా ప్రాంతం నుండి ప్రాధాన్యత గల ఆ ప్రాంతంలో ఒకే ఒక లైన్ల ట్రాఫిక్ కొరకు అందుబాటులో ఉంటుందని ఆ మార్గంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.అదేవిధంగా అల్ ఎంటీఫేదా వీధి వెలుపలకు వెళ్లేందుకు దారి తీసే క్రోకార్నిష్ రహదారి కూడా మూసివేశారు, పాక్షిక రహదారి మూసివేత గురువారం నుండి మొదలు కాబడి శనివారం రాత్రి వరకు ఇది కొనసాగుతుందని ఆ తర్వాత ట్రాఫిక్ కొరకు తెరవనున్నారని అధికారవర్గాలు తెలిపాయి. డ్రైవర్లు తమ తమ వాహనాల వేగాన్ని తగ్గించేందుకు శ్రద్ధ తీసుకోవాలని ట్రాఫిక్ రద్దీని తొలగించడం కోసం ప్రత్యామ్నాయ రోడ్ల వైపునకు మళ్లాలని కోరారు. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని , కానీ తాము సూచించిన రహదారి మల్లింపు వినియోగదారులకు ఎంతో ఉత్తమమైందని షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







