స్వల్ప మొత్తంలో నకిలీ మందులు అమ్ముకొనే 5,000 వెబ్సైట్లు మూసివేయాలి

- March 31, 2017 , by Maagulf
స్వల్ప మొత్తంలో నకిలీ మందులు అమ్ముకొనే  5,000 వెబ్సైట్లు మూసివేయాలి

అబూధాబీ :  నకిలీ ఉత్పత్తులు లో ప్రముఖ నిపుణులతో కూడిన ఒక  కమిటీ నకిలీ సరుకుల్లో కొద్ది కొద్దిగా నకిలీ మందులు అమ్ముకొనే వ్యాపార తీరుని దుయ్యబట్టారు. అంతర్జాతీయ చట్టం అతిక్రమించి సమాజానికి  ఒక ప్రధాన సవాలుగా ఎలా మారుతున్నారో అనే అంశంపై  అబూధాబీ లో జరిగిన " భద్రత కొరకు ఐక్యత "  సమావేశంలో చర్చించారు.వైద్య పరిశ్రమ అంటేనే నమ్మకం కోల్పోయేలా వినియోగదారులకు విరక్తి కల్గించేలా నష్టం కల్గించే  నకిలీ మందుల వ్యాపారం ఆన్ లైన్ ద్వారా వ్యాపారం చేస్తున్నారని అన్నారు.  ఫలితంగా, క్యాన్సర్, గుండె జబ్బులు , కోమా సంభవించి ఆకస్మిక మరణం వంటి తీవ్ర పరిణామాలు జరుగుతున్నాయని నిపుణులతో కూడిన కమిటీ చర్చించినట్లు తెలిపారు. అబూధాబీ లో జరిగిన " భద్రత కొరకు ఐక్యత "  సమావేశం యొక్క చివరి రోజున, నకిలీ ఉత్పత్తుల గూర్చి  ప్రముఖ నిపుణులతో కూడిన కమిటీ నకిలీ సరుకుల్లో వాణిజ్యం అంతర్జాతీయ చట్టం అమలు కమ్యూనిటీ మరియు ప్రపంచ ప్రజారోగ్యం కొరకు ఒక భారీ ప్రమాదం జరిగి వైద్యరంగంకు ఒక ప్రధాన సవాలుగా ఎలా పరిణమిస్తుందో కూలంకుషంగా ఈ సమావేశంలో చర్చించారు. అక్రమ ఉత్పత్తుల రవాణాలో మందులను తారుమారు చేసి , నకిలీల, పైరసీ, అక్రమ రవాణా, పన్ను ఎగవేత , కల్తీ చేసిన మందులను కారు స్పేర్ పార్ట్శ్  మరియు బొమ్మలలో ఉంచి తరలిస్తున్నారని తెలిపారు.మీరు ఒక నకిలీ ఉత్పత్తి కొనుగోలు చేసినప్పుడు, అది ప్రమాదం అని గుర్తించినప్పుడు దానిని తిరిగి మార్చుకోవడానికి ఎటువంటి వీలు ఉండదని ఐర్లాండ్ హెల్త్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ అథారిటీ  మేనేజర్  హుగో బానర్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com