విడుదలైన 'పటేల్‌ సార్‌' ట్రైలర్

- March 31, 2017 , by Maagulf
విడుదలైన 'పటేల్‌ సార్‌' ట్రైలర్

హీరో నుంచి 'లెజెండ్‌'తో విలన్‌గా మారి అందర్నీ ఆశ్చర్యపరిచారు జగపతిబాబు. ఫ్యామిలీ హీరో పాత్రల్లో సాఫ్ట్‌గా కనిపించి మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలు అధికంగా పొందిన ఆయన.. క్రూరమైన ప్రతినాయకుని వేషంలోనూ గొప్పగా రాణించి, మెప్పించారు. ఇంకోవైపు కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి టైటిల్‌ పాత్రధారిగా ఓ సినిమా చేసేందుకు అంగీకరించారు జగపతి. ఆ సినిమా పేరు 'పటేల్‌'. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ చిత్రానికి 'యస్‌.ఐ.ఆర్‌' అనేది ట్యాగ్‌ లైన్. వాసు పరిమి దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ 'ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌' షూటింగ్‌ రెండు రోజుల క్రితమే మొదలైంది. ఎం.ఎం. కీరవాణి క్లాప్‌నివ్వగా, కల్యాణ్‌ కోడూరి కెమెరా స్విచ్చాన్ చేసిన ముహూర్తపు సన్నివేశానికి యస్‌.యస్‌. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. అదే రోజు సినిమా ఎలా ఉండబోతోందో చూచాయగా తెలపడానికి ఒక టీజర్‌ను విడుదల చేశారు.

షూటింగ్‌కు వెళ్లే ముందు కేవలం రెండు రోజుల్లో దీనిని తయారు చేశారు. ఇందులో ఇప్పటివరకూ కనిపించని కొత్త రూపంలో కనిపిస్తున్నారు జగపతిబాబు. తెల్లటి జుట్టు, గడ్డంతో 'ఇంటెన్స్ లుక్‌'తో ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రానికి రచన: సునీల్‌, సంగీతం: డీజే వసంత్, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు, లైన్ ప్రొడ్యూసర్‌: కార్తికేయ, సమర్పణ: సాయిశివాని, నిర్మాత: రజని కొర్రపాటి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com