ఉసిరి బజ్జీలు

- April 01, 2017 , by Maagulf
ఉసిరి బజ్జీలు

కావలసిన పదార్ధాలు: బంగాళాదుంపలు - నాలుగు, పచ్చిమిర్చి - ఐదు, నూనె - రెండు కప్పులు, ఉసిరి తురుము - నాలుగు కప్పులు, ఉప్పు - తగినంత, కరివేపాకు రెబ్బలు - రెండు, శనగపిండి - కప్పు, బియ్యప్పిండి - పావుకప్పు, జీలకర్ర - రెండు చెంచాలు, వాము - రెండు చెంచాలు, కారం - కొద్దిగా, వంటసోడా- అరచెంచా, ఆవాలు- చెంచా.
 
తయారీ విధానం: ముందుగా బంగాళాదుంపల్ని ఉడికించి, పొట్టు తీసి పెట్టుకోవాలి. బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి ఆవాలూ, జీలకర్రా వేయించుకోవాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలూ, కరివేపాకు రెబ్బలూ వేసుకోవాలి. అవి వేగాక ఉసిరి తురుము వేయాలి. రెండు నిమిషాల తరువాత తగినంత ఉప్పూ, బంగాళాదుంపల ముద్దా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బుల్లెట్‌ ఆకృతిలో చేసుకుని పెట్టుకోవాలి. ఓ గిన్నెలో శనగపిండీ, బియ్యప్పిండీ, వంటసోడా, వాము, కారం, కొద్దిగా ఉప్పూ వేసి, నీళ్ళతో బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఉసిరి బుల్లెట్లను ఈ పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసుకుంటే సరి... నోరూరించే ఉసిరి బజ్జీలు సిద్ధం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com