సింగపూర్ లో వైభవంగా ఉగాది సంబరాలు

- April 02, 2017 , by Maagulf

 

శ్రీ హేవళంబినామ సంవత్సర ఉగాది పండుగను సింగపూర్ తెలుగు వారు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సెరంగూన్ శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయమందు సుప్రభాత సేవ, తిరు మంజనం, గరుడ వాహన సేవ, శ్రీనివాస కల్యాణం, పంచాంగ శ్రవణం మరియు అన్నదాన కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రధ్దలతో నిర్వహించారు.

వీనుల విందుగా జరిగిన శ్రీనివాస కల్యాణం వేడుకలో 1500 పైగా తెలుగు వారు మరియు 70 జంటలు కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ప్రత్యేకంగా తెప్పించబడిన శ్రీవారి లడ్డు ప్రసాదము, అమ్మవారి కుంకుమ, ఉత్తరీయం, రవిక, అభిషేక జలం, వెండి నాణాలు ఇవ్వడం జరిగింది. చిన్నారుల గోవింద గీతాలతో, భక్తుల గోవింద నామాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. కల్యాణం అనంతరం జరిగిన పంచాంగ శ్రవణం అందినీ విశేషంగా అలరంచింది. 
తెలుగు సమాజం అధ్యక్షులు శ్రీ రంగా రవి కుమార్, ఉపాధ్యక్షులు శ్రీ రత్నకుమార్ ఈ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక ఎంతోమంది సహాయ సహకారాలు అందించారని తెలిపారు. 
సమాజం కార్యకర్తలకు, సభ్యులకు, కల్యాణం జంటలకు, అన్నదాన దాతలకు, వాలంటీర్లకు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com