రష్యాలో మెట్రో రైల్లో పేలుడు,10 మంది మృతి
- April 03, 2017
రష్యాలో మెట్రో రైల్లో భారీ పేలుడు జరిగింది. సెయింట్ పీటర్స్ బర్గ్‌లో ఒక మెట్రో రైలు బోగీ బాంబు పేలుడుతో ధ్వంసమైంది. ఈ పేలుడులో పది మంది మృతి చెందినట్లు, 15 మంది గాయపడ్డట్టు అధికారులు ప్రకటించారు. స్థానిక మీడియా మాత్రం పది మంది వరకూ మరణించారని.. చాలా మంది గాయపడ్డారని పేర్కొంది.
మెట్రో రైల్లో పేలుడుతో మూడు మెట్రో స్టేషన్లు మూసివేశారు. పేలుడు తర్వాత ఆ ప్రాంతమంతా పొగలు అలుముకున్నాయి.. జనం భయంతో పరుగులు తీశారు. పేలుడుకు కారణమేంటనేది అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. ఇది ఉగ్రదాడి అయ్యుంటుందని అనుమానిస్తున్నారు. రైలు బోగీ పేలుడులో ఛిద్రమవడంతో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!







