అమ్నెస్టీ కోసం వలసదారుల ఉరుకులు పరుగులు
- April 05, 2017
జెడ్డా: అమ్నెస్టీ పీరియడ్‌ని వినియోగించుకునేందుకోసం వలసదారులు పరుగులు తీస్తున్నారు. గడువు తీరిన రెసిడెంట్ ఐడీలు కలవారు, అలాగే సౌదీజైషేన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్నవారు, ఇతరత్రా కారణాలతో దేశం విడిచి వెళ్ళాల్సి ఉన్నవారు అమ్నెస్టీని వినియోగించుకోవాలనుకుంటున్నారు. అయితే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవజాత్), అమ్నెస్టీ ద్వారా దేశం విడిచి వెళ్ళాలనుకునే కార్మికులు ముందుగా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ బ్రాంచ్‌కి వెళ్ళి, సంబంధిత సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. కానీ లేబర్ మినిస్ట్రీ ఆఫీస్ జెడ్డా మాత్రం జవజాత్‌కి రిఫర్ చేస్తోంది. జవజాత్ మళ్ళీ వారిని లేబర్ కార్యాలయానికి తిప్పి పంపుతోంది. ఈ వ్యవహారంపై లేబర్ మినిస్ట్రీ అధికార ప్రతినిథి ఖాలిద్ అబా అల్ ఖలిల్ స్పందించడంలేదు. ఈ తరహా సమస్యల పరిష్కారం కోసం భారత కాన్సుల్ జనరల్, సంబంధిత అధికారులతో చర్చలు ప్రారంభించారు. సమస్య పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇండియన్ కాన్సుల్ జనరల్ మొహమ్మద్ నూర్ రహ్మాన్ షేక్ చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







