అమెజాన్‌లో ఉద్యోగాలు!
- April 05, 2017
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారత్‌లో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. గృహోపకరణాలు, ఫర్నిచర్ కేటగిరీలో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించేందుకు వీలుగా భారత్‌లో ప్రత్యేకంగా ఏడు గోదాములు నిర్మించనుంది. వీటిలో పనిచేసేందుకు దాదాపు 1200 మంది సిబ్బందిని నియమించనున్నారు. ఇందుకోసం మొత్తం 5బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ సిద్ధమవుతోంది. భారత్‌లో డిమాండ్ ఆధారంగా మొత్తం 33 డెలవరీ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే భారత్‌లో ఆ సంస్థకు 27 గోదాములు ఉన్నాయి. తాజాగా మరో 7 గోదాముల నిర్మాణంతో వాటి సంఖ్యను 34కు విస్తరించి పది రాష్ట్రాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించనుంది.
భారత్‌లోని మొత్తం 150 నగరాల్లో వినియోగదారులకు భారీ గృహోపకరణాలు, ఫర్నిచర్ సామగ్రిని వేగంతో పాటు నమ్మకంగా అందజేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు అమెజాన్ ఇండియా వైస్‌ప్రెసిడెంట్ అఖిలేశ్ సక్సేనా తెలిపారు.
గృహోపకరణాల జాబితాలోని ఏసీలు, ఎయిర్ కూలర్స్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లకు భారీగా గిరాకీ ఉండటంతో దీనిపై ఆ సంస్థ దృష్టిపెట్టింది. గతేడాది ఈ కేటరిగీకి చెందిన వస్తువుల అమ్మకాల్లో 200శాతం వృద్ధి ఉన్నట్టు సంస్థ తెలిపింది. కొత్తగా ఈ గోదాములను తెలంగాణ, కర్ణాటక, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్‌బంగ రాష్ట్రాల్లో ఏర్పాటుచేయనున్నట్టు సక్సేనా తెలిపారు.
తాజా వార్తలు
- పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్‌కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









