337 మోటార్ బైక్‌ల స్వాధీనం
- April 05, 2017
రస్ అల్ ఖైమా పోలీసులు, ట్రాఫిక్ క్యాంపెయిన్ సందర్భంగా గడచిన రెండు వారాల్లో మొత్తం 337 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన నేపథ్యంలో ఈ బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్, రస్ అల్ ఖైమా పోలీస్ - కల్నల్ అలి సయీద్ అల్ అల్కీమ్ చెప్పారు. అధిక వేగంతో వాహనాలు నడపడం, రాత్రి వేళల్లో భారీ శబ్దం చేయడం వంటి ఉల్లంఘనలకు వాహనదారులు పాల్పడ్డట్లు ఆయన వివరించారు. యువకులు రాత్రి వేళ్ళలో తమ వాహనాలతో చేస్తున్న స్టంట్స్ సామాన్యులకు ఇబ్బందికరంగా మారుతున్నాయనీ, అందుకే ఇలాంటి ఫీట్స్‌పై కఠిన చర్యలు చేపట్టామని తెలిపారు అల్ అల్కీమ్. మార్చ్ 17న ఒక్క రోజే మొత్తం 51 మోటార్ బైక్స్‌ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కూడా ఇందులో ఉన్నాయి. అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు 1000 దిర్హామ్‌ల జరీమానా, 24 బ్లాక్‌పాయింట్స్ తప్పనిసరి.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







