ఐటెం గర్ల్ గా హ్యాపీ డేస్ ఫేమ్ సోనియా

- April 06, 2017 , by Maagulf
ఐటెం గర్ల్ గా హ్యాపీ డేస్ ఫేమ్ సోనియా

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతో నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్స్ పరిచయం అయ్యారు. ఇక ఆ నలుగురిలో శ్రావ్స్ గుర్తుందిగా .. అదే సోనియా !! ఆ తరువాత హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి పెద్దగా కమర్షియల్ విజయాలు దక్కలేదు, దాంతో హీరోయిన్ ఫ్రెండ్ గా దూకుడు సినిమాలోనూ నటించింది. హీరోయిన్ గా కెరీర్ బాగాలేదు కాబట్టి .. ఈ అమ్మడు ఓ డేరింగ్ నిర్ణయం తీసుకుందట..అదేమిటో తెలుసా ..
 
ఇకపై ఐటెం గర్ల్ గా చేయడానికి రెడీ అయిందట ..
రింగు రింగుల జుట్టుతో ఆకట్టుకున్న సోనియా కు ఇప్పుడు ఓ క్రేజీ సినిమాలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వచ్చిందని , ఆ సాంగ్ చేయడానికి ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం.. మరి ఐటెం గర్ల్ గా ఈ అమ్మడు ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com