భారత ప్రవాసీయుని అనుమానాస్పద మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్
- April 06, 2017
లాకప్ మరణాలు మన దేశంలోనే కాదు ఎడారి దేశంలోనూ జరగడం పలువురికి ఆశ్చర్యం కల్గిస్తుంది. వాదిత్య శ్రీనివాస్ అనే 30 ఏళ్ళ ప్రవాసియ భారతీయుడు సౌదీ అరేబియా పోలీసు కస్టడీలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం పట్ల ఆయన తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కుమారుడు ఆకస్మికంగా చనిపోవడంపై పలు సందేహాలు ఉన్నాయని ఆ మృతి పట్ల సరైన దర్యాప్తు చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27 వ తేదీ రియాద్ లోని వాదిత్య శ్రీనివాస్ ను ఒక ట్రాఫిక్ ఉల్లంఘన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అల్ మొరాబా పోలీసు స్టేషన్ లో నిర్బంధించారు. ఆ తర్వాత శ్రీనివాస్ ఉరి వేసుకొని మరణించినట్లు కనుగొనబడింది. మరణించిన వాదిత్య శ్రీనివాస్ అన్నయ్య వెంకటేష్ మాట్లాడుతూ, తన తమ్ముడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు మాత్రం కాదని వాదిస్తున్నాడు. పోలీసు స్టేషన్ లో ఆత్మహత్య చేసుకొన్నట్లు చిత్రీకరిస్తున్న పోలీసులు తన సోదరుడి మరణ విషయం ఏదో గోప్యంగా ఉంచుతున్నారని తెలిపారు. వారు తన తమ్ముడు జేబులో ఉన్న మొబైల్ మరియు పర్సు గురించి ఏమీ చెప్పలేకపోతున్నారని పేర్కొన్నాడు ఇదంతా చూస్తుంటే, వారు ఏదో " తప్పుడు నాటకం" ఆడుతున్నట్లు అనుమానంగా ఉందని ఆయన అన్నారు. వెంకటేష్ సైతం కొన్నాళ్ల క్రితం రియాద్ లో పని చేసినపుడు అదే ప్రాంతంలో నివసించాడు. తనకు నాసిరియా ప్రాంతంలో తనకు ఉన్న స్థానిక స్నేహితుల సహకారంతో లాకప్ లో అనుమానంగా చనిపోయిన తన తమ్ముడు వాదిత్య శ్రీనివాస్ అనుమానాస్పద మరణం గూర్చి ఫిర్యాదు చేశారు. అంతేకాక, భారతదేశంలోని తెలంగాణా రాష్ట్రం లోని వికారాబాద్ జిల్లా కలెక్టర్ డి. విద్యా ను సోమవారం కల్సి ఆమె చేతికి ఒక అర్జీని వాదిత్య శ్రీనివాస్, వెంకటేష్ తండ్రి వాదిత్య గోవింద్ అందచేశారు. తన కుమారుడి నిర్భంధ మరణం గూర్చి సమగ్ర పరిశోధన జరిపించాలని, సౌదీ అధికారులతో జరిపించేలా చర్యలు తీసుకోవాలని ఆ వృద్ధ తండ్రి ఆమెను అభ్యర్ధించారు. పోలీసులు ఈ సంఘటన జరిగినప్పుడు వారి నిర్బంధంలో తన సోదరుడు ఉన్నారని కనుక తన తమ్ముడి మరణంకు పూర్తి బాధ్యత పోలీసులదేనాని వెంకటేష్ డిమాండ్ చేసాడు. ఒక వ్యక్తి రియాడ్ పోలీసు స్టేషన్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొనే మార్గమే లేదని వెంకటేష్ ఒక కీలకాధారం ఎత్తి చూపారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం 'ఉరి ద్వారా ఊపిరి ఆడక ఫలితంగా గుండె మరియు శ్వాస ఆగిపోవడం వాదిత్య శ్రీనివాస్ మరణానికి ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్‌సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









