అబూధాబీలో తాత్కాలిక రోడ్డు మూసివేత గురువారం నుంచి ప్రారంభం

- April 06, 2017 , by Maagulf
అబూధాబీలో తాత్కాలిక రోడ్డు మూసివేత గురువారం నుంచి ప్రారంభం

అబూధాబీ ద్వీపాల్లో అల్ మఖ్ట బ్రిడ్జ్ నిర్వహణ కారణంగా సాధారణ స్థితి కంటే భారీ ట్రాఫిక్ ఈ వారాంతంలో పెరిగే అవకాశం ఉంది. అల్ మఖ్ట  బ్రిడ్జ్ పై రెండు దారులను పాక్షికంగా మూసివేయనున్నారు. రహదారి పనులు పూర్తి చేసేందుకు ఆ రోడ్లను గురువారం (నిన్నటి) నుంచి మూసివేయబడతాయని అబూధాబీ పోలీస్ ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ డైరెక్టరేట్ ప్రకటించింది.అబూధాబీ సిటీ మునిసిపాలిటీతో సమన్వయంతో నిర్వహణ పనుల, ఏప్రిల్ 6 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు కొనసాగనున్నాయి.ఈ ప్రభావితంగా కేవలం వాహనదారులు అబూధాబీ కూడలి వరకు గురువారం రాత్రి 11 గంటల నుండి, ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనదారులు మరియు వారి స్వంత భద్రత కోసం ట్రాఫిక్ మళ్లింపుల ప్రాంతంలో హెచ్చరికలు గమనించి డ్రైవింగ్ చేయాలని పని జరిగే ప్రాంతంలో బైపాస్ మార్గాల ద్వారా ప్రయాణించాలని  అబూధాబీ పోలీస్ పిలుపు నిచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com