కాబోయే అల్లుళ్లను వింత కోర్కెలతో కాల్చుకు తింటున్న పిల్లను ఇచ్చే సౌదీ మామలు

- April 07, 2017 , by Maagulf
కాబోయే అల్లుళ్లను వింత కోర్కెలతో కాల్చుకు తింటున్న పిల్లను ఇచ్చే సౌదీ మామలు

సౌదీ అరేబియా : కన్యాశుల్కం గల్ఫ్ దేశాలలో బలంగా వేళ్లూనుతుంది. అరబ్ వరులు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటే పిల్లను ఇచ్చే మామలను ద్రవ్య ,వాస్తు , వాహన, వింత కోర్కెలను తీర్చి ముందుగా   ప్రసన్నం చేసుకోవాల్సిఉంది. వారు డిమాండ్ చేసిన ఖరీదైన కట్నకానుకలు అడిగినప్పుడు కిక్కురుమనకుండా కాబోయే అల్లుళ్ళు చెల్లించలేకపోతే ఆ పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి. సౌదీ అరేబియా లో వధువుల తండ్రులు తమ కుమార్తెలను ఇచ్చే ముందు తమకు కాబోయే అల్లుళ్ళు   నైతికత మరియు నిజాయితీలకు  మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఆ తర్వాత తమ తమ గొంతెమ్మ కోర్కెలు మాత్రం తీర్చకపోతే, మామలు పెదవి విరిచి మరో అల్లుడిని వెతుక్కోవడాని ఏమాత్రం వెనుకాడటం లేదని కుర్రకారు కారాలు మిరియాలు నూరుతున్నారు. మరి కొందరు పిల్ల నిచ్ మామలు వింత పరీక్షలు పెట్టి తమ అల్లుళ్ళ సంపాదన సహనంను పణంగా పెడుతున్నారు..అత్యధిక వరుళ్లు ముందు షాదీ కానిచ్చిన తర్వాత మామల పని పడదామని ఎంతో ఓపిగ్గా పరీక్షా కాలంను ఓర్పుతో భరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. తనకు అల్లుడిగా కావాల్సిన వరుడు ఖురాన్ మొత్తాన్ని గడ గడ చదివి బట్టే పట్టేసి అన్ని అధ్యాయాలు గుర్తుంచుకోవాలని, ఆ పవిత్ర గ్రంధంలో ఎక్కడ ఏదీ అడిగినా గుక్క తిప్పుకోకుండా ఠకీ మని  చెప్పేయాలని ఆ కాబోయే అల్లునికి షరతు పెట్టడంతో  పెళ్లి కుమార్తె కావాలంటే వేయి పేజీలకు పైగా ఉన్న ఖురాన్ మొత్తం ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలో తెలియక ఆ 26 ఏళ్ల వరుడు బిక్కమొహంతో చచ్చుపడిపోయినట్లు ముఖభావాలను ఒలికిస్తున్న ఆ వీడియో వైరల్ కాబడింది.  యాసిర్ ప్రాంతంలో అభ లో వధువు తండ్రి తనకు కాబోయే అల్లుడు కేవలం 10 రియల్స్ కట్నం ఇస్తే సరిపోతుందని అయితే ఆ నోట్లు మొత్తం నూతనంగా మారిన సౌదీ ద్రవ్యాన్ని చెల్లించాలని మెలిక పెట్టి డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆ కొత్త నగదు సరిగా బ్యాంకు లలోనే లభ్యం కావడం లేదు. సాధారణంగా ఖరీదైన డిమాండ్లను కాబోయే అల్లుళ్లను అడుగుతారని తాను ఎంతో తక్కువ నగదుని అడిగెనని అదే సమకూర్చనపుడు తన కుమార్తెను ఏ విధంగా చూస్తాడని ఆ మామగారు చుర్రుబుర్రులాడుతున్నారు. తాను సంప్రదాయాలను, విచ్ఛిన్నం చేయ కూడదని లక్ష్యంతో ఈ చిన్న మొత్తం ఆశించకూడదా అని ఆయన ఎదురు ప్రశ్న వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com