అల్లు శిరీష్ కొత్త సినిమా ప్రారంభం
- April 09, 2017
అల్లు శిరీష్ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. సురభి, సీరత్ కపూర్ కథానాయికలు. శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఫిలింనగర్ సన్నిధానంలో నిర్వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నిర్మాత చక్రి తండ్రి శంకర్ చిగురుపాటి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తొలి షాట్‌కు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ నెలాఖరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ.. ‘రొమాంటిక్ థ్రిల్లర్ కథ ఇది. సైన్స్ ఫిక్షన్ కూడా ఉంటుంది.
మంచి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. మలయాళంలో ‘1971’, ‘దృశ్యం’ చిత్రాలకు పనిచేసిన సుజిత్ వాసుదేవ్ దీనికి సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. అన్ని వర్గాల్ని మెప్పించే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది’ అన్నారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









