మా దేశం విడిచి వెళ్లిపో మళ్లీ యూఎస్‌లో

- April 09, 2017 , by Maagulf
మా దేశం విడిచి వెళ్లిపో మళ్లీ యూఎస్‌లో

అమెరికాలో మళ్లీ జాత్యహంకారం బయటపడింది. తెలంగాణకి చెందిన ఓ స్టూడెంట్‌ని కొంతమంది దుండగులు బెదిరించిన విషయం తీవ్ర కలకలం రేపుతోంది. తమ దేశం విడిచివెళ్లిపోవాలని గట్టిగా హెచ్చరించారు ఆగంతకులు. మంచిర్యాల జిల్లాకు చెందిన సాయికిరణ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ కోసం రెండేళ్ల కిందట అమెరికా వెళ్లాడు.
ప్రస్తుతం మిసిసిపి రాష్ట్రంలోని క్లింటన్‌ సిటీలో వుంటున్నాడు. ఓ వైపు చదువుతూనే పార్ట్ టైమ్ షెల్ గ్యాస్‌స్టేషన్‌లో పని చేస్తున్నాడు. డ్యూటీకి హాజరైన సాయి, మంచిర్యాలలోవున్న తన తల్లితో వీడియో కాల్ మాట్లాడుతుండగా, గ్యాస్ స్టేషన్‌లో దోపిడీ దొంగలు ప్రవేశించారు. వరుణ్‌కు రివాల్వర్‌ గురిపెట్టి క్యాష్‌ను దోచుకున్నాడు.
అంతేకాదు నీవు భారతీయుడివి కధా ఇక్కడెందుకున్నావు? మీ దేశానికి తిరిగి వెళ్లమని బెదిరించారు. ఇదంతా సీసీకెమెరాలో నమోదుకావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com