హైదరాబాద్‌లో దుబాయ్ తుంబె గ్రూప్ ఆసుపత్రి
- April 11, 2017
దుబాయ్ కేంద్రంగా వైద్య సేవలందిస్తున్న తుంబె గ్రూప్ భారత్‌లో తొలి ఆసుపత్రిని బుధవారం ప్రారంభిస్తోంది. హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో ఉన్న న్యూలైఫ్ హాస్పిటల్‌ను తుంబె గ్రూప్ కొనుగోలు చేసి ఆధునీకరించింది. తుంబె హాస్పిటల్ న్యూ లైఫ్ పేరుతో ఈ 200 పడకల ఆసుపత్రిని నిర్వహిస్తామని సంస్థ మెడికల్ డైరెక్టర్ టి.శ్యామ్ సుందర్ చెప్పారు. హాస్పిటల్ సీవోవో బాలాజీ గోలి, గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ రవి తిప్పరాజుతో కలసి మంగళవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు.
చాదర్‌ఘాట్ హాస్పిటల్ కంటే పెద్ద ఆసుపత్రిని మాదాపూర్ సమీపంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. మూడేళ్లలో 1,500 పడకల సామర్థ్యానికి చేరుకోవాలన్నది గ్రూప్ లక్ష్యమని వెల్లడించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 8–10 ఆసుపత్రులు వచ్చే అవకాశం ఉందన్నారు. నర్సులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్టు శ్యామ్‌సుందర్ తెలిపారు. తుంబె గ్రూప్‌ను కర్ణాటకలోని మంగళూరుకు చెందిన తుంబె మొయిద్దీన్ ఏర్పాటు చేశారు. యూఏఈలో సంస్థకు నాలుగు ఆసుపత్రులున్నాయి. రియల్ ఎస్టేట్, రిటైల్, హాస్పిటాలిటీ రంగాల్లోనూ ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







