దుబాయ్ లో ఐదేళ్ళ బాలికను ముద్ధాడిన పాఠశాల బస్సు డ్రైవర్ కు జైలుశిక్ష

- April 13, 2017 , by Maagulf
దుబాయ్ లో ఐదేళ్ళ బాలికను ముద్ధాడిన పాఠశాల బస్సు డ్రైవర్ కు జైలుశిక్ష

దుబాయ్ : ' వినాశకాలే ....విపరీత బుద్ధి '  అన్నట్లుగా మారింది ఆ డ్రైవర్ పాడుబుద్ధి.. పిల్లలను ఇంటి నుండి బడికి ...బడి నుండి ఇంటికి తీసుకెళ్లాల్సిన ఓ బస్సు డ్రైవర్ కు మెదడులో పురుగు తొలిచి ముక్కుపచ్చలారని చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఆ చిన్నారిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని కౌగలించుకొంటూ ఆపై  ముద్దాడుతూ పైత్య వికారాలను ప్రదర్శించాడు.ఈ నేరానికి నిందితునికి ఒక సంవత్సరం జైలుశిక్ష విధించారు. ఈ ఏడాది జనవరి 19 వ తేదీన జరిగిన ఈ ఘటనలో  26 ఏళ్ల పాకిస్తానీ వ్యక్తి బస్సులో ఎవరు లేని సమయంలో ఆ బాలిక పట్ల తన కామ వికారాలను ప్రదర్శించాడు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ రికార్డులు పరిశీలించిన తర్వాత ఆ  నేరానికి గాను న్యాయస్థానం చేత ఆ శిక్ష విధించబడింది. శిక్షాకాలం ముగిసిన తర్వాత నిందితుడిని దేశం విడిచి పోవాలని తీర్పుని ఇచ్చింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com