హైదరాబాద్ లోఅర్థరాత్రి ఘోర ప్రమాదం... తన కారులో ఆస్పత్రికి తరలించిన కేటీఆర్
- April 13, 2017
హైదరాబాద్ నగరంలోని తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం వద్ద గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. లాలాపేటకు చెందిన ఎండీ అజార్(37), ఇమ్రానాబేగం(35) దంపతులతో పాటు ముగ్గురు పిల్లలు ఓ కార్యక్రమానికి హాజరై... అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరారు.
వారి వాహనం ఆర్టీఏ కార్యాలయం వద్ద మలుపు తీసుకుంటుండగా... జీహెచ్ఎంసీ చెత్త తరలింపు వాహనం (ఎపీ24వీ5893) వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో ఆజర్(37), అమన్(9), అశ్వియా(7), అలీనా(3) అక్కడికక్కడే చనిపోయారు. అజహర్ భార్య ఇమ్రాన్‌బేగం, మరో చిన్నారి అదియా తీవ్రంగా గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదం జరిగిన సమయానికే అటుగా మంత్రి కేటీఆర్ వెళుతున్నారు. ఈ ప్రమాదాన్ని చూసి చలించిపోయిన కేటీఆర్.. తక్షణం తన కారును ఆపి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని మేయర్ బొంతు రామ్మోహన్‌కు చేరవేయగా, ఆయన ప్రమాద స్థలానికి వచ్చి క్షతగాత్రుల వెంట ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మరణించిన వారికి రూ.5లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పారిపోయాడు.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







