అఫ్గానిస్థాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ దాడిలో 90మంది మృతి
- April 15, 2017
అఫ్గానిస్థాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ స్థావరంపై అమెరికా జరిపిన అతిపెద్ద బాంబును జారవిడవడంతో హతమైన ఉగ్రవాదుల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఈ దాడిలో ఇప్పటివరకు 90మంది ఐసిస్ ఉగ్రవాదులు మృతిచెందినట్లు అచిన్ గవర్నర్ ఇస్మాయిల్ షిన్వారీ మీడియాకు వెల్లడించారు. నాన్‌గర్హర్ ప్రావిన్స్ అధికారి ప్రతినిధి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
అఫ్గాన్-పాక్ సరిహద్దుల్లో గల నాన్‌గర్హర్ ప్రావిన్స్‌లోని అచిన్ జిల్లాలో అమెరికా గురువారం అతిపెద్ద బాంబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. జిల్లాలోని సొరంగమార్గ సముదాయంపై జీజీయూ-43/బి బాంబును జార విడిచింది. ఈ దాడిలో ఐసిస్‌కు చెందిన మూడు భూగర్భ సొరంగాలు, భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ధ్వంసమయ్యాయి. అయితే తొలుత 36 మంది ఉగ్రవాదులు మరణించినట్లు అఫ్గాన్ రక్షణశాఖ వెల్లడించగా.. శనివారం నాటికి ఆ సంఖ్య 90కు చేరినట్లు అధికారులు తెలిపారు. ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’గా పిలిచే అతి శక్తిమంతమైన ఈ బాంబు 21,600 పౌండ్ల బరువుంటుంది.
తొలిసారిగా దీన్ని ఓ యుద్ధంలో ప్రయోగించారు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







