చికెన్‌లో కొకైన్‌

- April 15, 2017 , by Maagulf
చికెన్‌లో కొకైన్‌

 సౌదీ అథారిటీస్‌, కొకైన్‌ షిప్‌మెంట్‌ని వ్యూహాత్మకంగా అడ్డుకున్నాయి. కింగ్‌డమ్‌కి చెందిన వెస్ట్‌ కోస్ట్‌ ద్వారా కొకైన్‌ అక్రమ రవాణా జరుగుతుందన్న విషయమై సమాచారం అందడంతో, తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కస్టమ్స్‌ అధికారులు 46 కిలోల కొకైన్‌ని కింగ్‌ అబ్దుల్లా సీపోర్ట్‌ - రబిగ్‌లో పట్టుకున్నారు. ఫ్రోజెన్‌ చికెన్‌లో డ్రగ్స్‌ని దాచి, స్మగ్లర్స్‌ దాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. అధికారులు చాకచక్యంగా వ్యవహరించి కొకైన్‌ స్మగ్లింగ్‌ని అరికట్టగలిగారు. ఫిబ్రవరిలో సౌదీ మెరైన్‌ బోర్డర్‌ గార్డ్స్‌, రెడ్‌ సీ కోస్ట్‌పై ఓ బోట్‌ని ఆపి, కింగ్‌డమ్‌లోకి అక్రమంగా తరలి వస్తున్న కొకైన్‌ని అడ్డుకున్నారు. 400 కిలోల హాషిస్‌, 100,000 ఆంఫిటమైన్‌ పిల్స్‌ని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఈ ఘటనలో యెమెనీ స్మగ్లర్స్‌నీ అరెస్ట్‌ చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com