దేవినేని నెహ్రూ ఇక లేరు
- April 16, 2017
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 5.20 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన కొన్నిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. నెహ్రూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కంకిపాడు నుంచి అయిదుసార్లు, విజయవాడ తూర్పు నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పని చేశారు. 1994 నుంచి 1996 వరకు మంత్రిగా పని చేశారు. విజయవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరారు. ఇప్పుడు తన సొంతింటికి వచ్చినట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆయన 2004, 2009లలో కాంగ్రెస్ పార్టీ తరఫున టిడిపి నేత గద్దె రామ్మోహన రావుపై పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రి పదవి కోసం గట్టిగా పట్టుబట్టింది లేదు. కానీ రాజకీయాల్లో ఉండాలంటే ఏదో పార్టీ ఉండాలి కాబట్టి అలాగే ఉండిపోయారని అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోయారని చెబుతుంటారు. 2004, 2009లలో గెలిచినా మంత్రిగా కాలేదు. కృష్ణా జిల్లాకే పరిమితం అయ్యేవారు. 2014లో మాత్రం ఓడిపోయారు. అనారోగ్యం కారణంగా దేవినేని నెహ్రూ తన కొడుకును రాజకీయాల్లోకి ప్రధానంగా తెరపైకి తీసుకు వచ్చారు. నెహ్రూకు కూతురు, కొడుకు ఉన్నారు. దేవినేని నెహ్రూ మృతి చెందిన విషయం తెలిసిన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, తనయుడు దేవినేని అవినాష్, కార్యకర్తలు, అభిమానులు హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









