ఒక్క రోజులో 105,182 మంది ప్రయాణీకులు
- October 01, 2015
కింగ్ పహాద్ కాజ్‌వే మీదుగా ఆదివారం రికార్డు స్థాయిలో ప్రయాణీకులు ప్రయాణించారు. 1986లో ఈ కాజ్‌వే ప్రారంభమైన తర్వాత ఇదే పెద్ద రికార్డ్. హజ్ యాత్రికులు సౌదీ అరేబియా నుంచి తిరుగు ప్రయాణమయ్యే మార్గంలో ఉంటుంది. సెప్టెంబర్ 19 నుంచి 28 గల వారంలో 514,773 మంది ఈ కాజ్‌వేపై ప్రయాణించారు. మే 2న రికార్డు స్థాయిలో 104,400 మంది ప్రయాణించగా, ఆ రికార్డుని బ్రేక్ చేస్తూ ఆదివారం 105,182 మంది ప్రయాణించడం గొప్ప విషయం. ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంతో హజ్ యాత్రికుల ప్రయాణం సాఫీగా సాగింది. పాస్ పోర్ట్ వెరిఫికేషన్ వంటి వాటిల్లో తగు చర్యలు తీసుకున్నారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







