దుబాయ్ లో 'సన్ రైస్ హోలీ ట్రినిటీ చర్చి' ఆధ్వర్యంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు
- April 16, 2017
దుబాయ్ : దుబాయిలో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆడ్ మెహతా స్ట్రీట్ లో ఉన్న సన్ రైస్ హోలీ ట్రినిటీ చర్చి ప్రాంగణం వద్ద ఈస్టర్ ఆరాధన కార్యక్రమం జరిగింది. లోక రక్షకుడు యేసుక్రీస్తు శిలువలో మరణించి మూడవ రోజున తిరిగి లేచిన దినాన్ని పురస్కరించుకొని ఆదివారం యేసు పునరుత్తాన దినాన్ని దుబాయ్ లోని క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకే కొవ్వొత్తులు వెలిగించి ఇండ్ల వద్ద నుండి మనయేసు లేచెను, మనకెంతో ఆనందం అంటూ కీర్తనలు పాడుచూ చర్చిల్లోకి వెళ్లి స్తుతించారు. '' ఆయన మరణంను జయించాడు..సమాధి నుంచి పునరుద్హానుడై నిజంగా మేల్కొన్నాడు '' .లూకా 24: 2-3 ఏసుక్రీస్తుని సిలువపై క్రూరాతి క్రూరంగా హతమార్చి ఆయన మూడవ రోజున తిరిగి మరణాన్ని జయించనున్నాడని తెలుసుకొన్న శాస్త్రులు ప్రధాన యాజకులు పరిసయ్యలు యూదులు ఏసు సమాధిపై పెద్ద రాతి బండను ఉంచి ఇనుపసంకెళ్ళతో సీలు వేసి సైనికులను కాపలాగా ఉంచినప్పటకీ, ఆదివారం తెల్లవారుజామున ఇనుప సంకెళ్లని తెంపి సమాధి మీద ఉండిన పెద్ద రాయిని తొలగించి దేవుడు తన కుమారుని మరణం నుంచి పునరుద్ధానుడిగా చేశారు. ఉదయాన్నే ఏసు దేహానికి సుగంధ పరిమాళాలు పూయాలని తాలించిన కొందరు స్త్రీలు ఏసు సమాధి వద్దకు వచ్చి లోపలకు తొంగి చూడగా, ఆయన భౌతికదేహం కనబడక విలపిస్తున్న వారిని చూసి ఒక దేవదూత " సజీవుడైన దేవుని కుమారుడిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారని " ప్రశ్నించి ఏసు సజీవుడిగా లేచారని తెలిపిన శుభ దినమే ఈస్టర్ పండుగ ప్రధాన అంశం అని మతాధికారి చాప్లిన్ రెవరెండ్ హారిసన్ చిన్నకుమార్ యేసు పునరుత్థాన పండుగ సందర్భంగా ప్రసంగించారు. అలాగే ఆయన మాట్లాడుతూ ప్లూటో ఒక చల్లని గ్రహమని..మెర్క్యూరీ గ్రహం ఎంతో వేడిగా ఉంటుందని మరి భూమిపై ఉన్న క్రైస్థవునిగా నీవు ఎలా ఉన్నావని ప్రజలను ఉద్దేశించి అడిగేరు. ఏసుశిలువపై మరణం ఎంతో పవిత్రమైందని అన్నారు. శిలువ మరణం ఫలితంగా మానవ పాపాలు కడుగబడ్డాయన్నారు. ఈ ఆరాధనలో బైబిల్ యొక్క మొదటి పఠనం అపొస్తలుల కార్యములు 10: 34-43 చదివిన తర్వాత ఆశీర్వాద ప్రార్ధన జరిగింది.ఈస్టర్ ఆదివారం చర్చికి దుబాయ్ ఇండియన్ కాన్సులేట్ జనరల్ వైస్ కాన్సుల్ ఐ డి రాజు హాజరై ఈస్టర్ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా మిగిలారు.

తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్‌పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!
- కువైట్‌లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు చెల్లింపులపై కొత్త నిబంధనలు..!!
- సౌదీలో విజిట్ వీసా గడువు దాటితే 50 వేల రియాల్స్ ఫైన్, జైలుశిక్ష..!!
- యూఏఈలో అమెరికా కాన్సులర్ సేవలునిలిపివేత..!!
- రాయల్ హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ కు 25 ఏళ్లు..!!







