పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్‌ల 'పరదేశ ప్రయాణం'కు ఫిక్స్
- April 17, 2017
మాటలమాంత్రికుడు త్రివిక్రమ్, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ల కాంభోలో ఇది వరకే రెండు చిత్రాలు తెరకెక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ కాంభో మరోసారి రిపీట్ కానుంది. కాగా ఈ చిత్ర టైటిల్‌ను మొదటగా 'దేవుడే దిగివచ్చిన' అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత అభిమానులు 'ఇంజనీర్ బాబు' అంటూ ఒక టైటిల్‌ను సూచించారు. అయినా కూడా దర్శకుడు ఆ టైటిళ్లతో సంతృన్తి చెందక తాజాగా ఒక టైటిల్‌ను పరిశీలిస్తున్నాడు. అయితే ఈ టైటిల్ ఇంకా ఖరారు అయ్యిందా అనేది మాత్రం అధికారిక సమాచారం లేదు.
Also Read : కాటమరాయుడు ఓవర్సీస్ థియేటర్స్..
పవన్‌కు సరిపోయే కథను సిద్దం చేసి ఇప్పటికే షూటింగ్‌ను జరుపుతుండగా తాజాగా త్రివిక్రమ్ ఈ చిత్రానికి 'పరదేశ ప్రయాణం' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నాడు. దాదాపు ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేయాలనే ఆలోచన చేస్తున్నాడు. ఈ టైటిల్ పట్ల పవన్ కూడా సముఖత వ్యక్తం చేశాడట. అంతేకాకుండా ఈ టైటిల్ అభిమానులకు కూడా దగ్గరయ్యేలాగా ఉంది. టైటిల్ అనేది విడుదల తర్వాత ఎంత ప్రభావం చూపుతుందో మాటల మాంత్రికుడు బాగా అర్థం చేసుకుంటాడు కాబోలు అందుకే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యే టైటిల్‌లను ఫిక్స్ చేస్తాడు.
ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమాన్యుయెల్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్‌పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!
- కువైట్‌లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు చెల్లింపులపై కొత్త నిబంధనలు..!!
- సౌదీలో విజిట్ వీసా గడువు దాటితే 50 వేల రియాల్స్ ఫైన్, జైలుశిక్ష..!!
- యూఏఈలో అమెరికా కాన్సులర్ సేవలునిలిపివేత..!!
- రాయల్ హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ కు 25 ఏళ్లు..!!
- హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..







