ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్ర త్వరలో వెండితెరపై ప్రత్యక్షం

- April 17, 2017 , by Maagulf
ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్ర త్వరలో వెండితెరపై ప్రత్యక్షం

ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాల వేళ..విశ్వవిద్యాలయ చరిత్ర త్వరలోనే వెండితెరపై ప్రత్యక్షం కాబోతుంది.దేశ విదేశాల్లో ఉన్న ఉస్మానియా విద్యార్థులతోపాటు భావితరం విద్యార్థులను ఉత్తేజపరిచేలా తెలంగాణ ప్రభుత్వం ‘శతవసంతాల ఉస్మానియా’ పేరుతో ఓ లఘు చిత్రాన్ని నిర్మిస్తోంది .ఈ మేరకు ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో వీసీ రామచంద్రం లఘు చిత్రాన్ని లాంచనంగా ప్రారంభించారు. నాగాబాల సురేష్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ లఘు చిత్రంలో ఉస్మానియా విద్యార్థులతోపాటు సీనియర్‌ నటీనటులు నటిస్తున్నారు.ఈనెల 25న లఘు చిత్రాన్ని తెలంగాణలోని అన్ని థియేటర్‌ లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com