దుబాయ్‌లో మరో షాపింగ్‌ మాల్‌

- April 19, 2017 , by Maagulf
దుబాయ్‌లో మరో షాపింగ్‌ మాల్‌

భారీ మాల్స్‌, అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలుండే మాల్స్‌కి దుబాయ్‌ పెట్టింది పేరు. దుబాయ్‌ సిగలో మరో ఆణిముత్యం చేరబోతోంది. లులు గ్రూప్‌ తమ కొత్త షాపింగ్‌ మాల్‌కి సంబంధించిన వివరాల్ని వెల్లడించింది. 1 బిలియన్‌ దిర్హామ్‌ల ఖర్చుతో ఈ మాల్‌ నిర్మాణం చేపట్టారు. బుధవారం సిలికాన్‌ ఒయాసిస్‌లో స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ షాపింగ్‌ మాల్‌కి ఫౌండేషన్‌ స్టోన్‌ వేసినట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. యూఏఈ సివిల్‌ ఏవియేషన్‌ ప్రెసిడెంట్‌, అలాగే ఛైర్మన్‌, ఎమిరేట్స్‌ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ సిఇఓ షేక్‌ అహ్మద్‌ బిన్‌ సయీద్‌ అల్‌ మక్తౌమ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిలికాన్‌ ఒయాసిస్‌ అథారిటీ మరియు లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ సంస్థల ప్రతినిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మూడు అంతస్తుల ఈ మాల్‌, 83,000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఏర్పాటవుతోంది. 8,940 చదరపు మీటర్ల వైశాల్యంలో హైపర్‌ మార్కెట్‌, 7,500 చదరపు మీటర్ల వైశాల్యంలో డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌, 34,593 చదరపు మీటర్ల వైశాల్యంలో రిటైల్‌ షాప్‌లు మరియు సర్వీసులు, డైనింగ్‌ ఆప్షన్స్‌, 13 క్యాజువల్‌ రెస్టారెంట్స్‌, కేఫ్స్‌, 25 ఫుడ్‌ కోర్టుల యూనిట్స్‌ వంటివి ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. 3,600 వాహనాల పార్కింగ్‌ ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ కానుంది. దుబాయ్‌ అంటేనే షాపింగ్‌ డెస్టినేషన్‌ అనీ, ఈ కొత్త మాల్‌ ఆ షాపింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించి కొత్త చరిత్ర సృష్టిస్తుందని సంస్థల ప్రతినిథులు వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com