ప్రేమ తో యుఎఇ నుండి అందరకీ ఆహారం

- April 19, 2017 , by Maagulf
ప్రేమ తో యుఎఇ నుండి అందరకీ ఆహారం

దుబాయ్:అన్నం...పర బ్రహ్మం అని పెద్దలు అంటారు.. అన్ని దానాలలో అన్నదానం గొప్ప దానమని పేర్కొంటారు..సరిగ్గా అదే విషయాన్ని దుబాయ్ మునిసిపాలిటీ వాస్తవంగా అమలుచేస్తుంది. మొట్ట మొదటి ఆహార బ్యాంకు ప్రాజెక్ట్ బుధవారం ( నేడు ) అల్ ఖైల్  రోడ్ లో అల్ క్కువుజ్ ఏర్పాటుచేసి తన దాతృత్వాన్ని చాటుకొంది. ఆహార విరాళం అందించే  ధార్మిక 30 ఆహార స్థాపనలు దుబాయ్ పురపాలక పరిధిలో  తెరుచుకుంటుందని వైస్ ప్రెసిడెంట్ మరియు యూఏఈ  ప్రధాన మంత్రి  మరియు దుబాయ్ పాలకుడు  శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం జనవరిలో ప్రకటించారు, యూఏఈ  ఆహార బ్యాంక్ ప్రాజెక్ట్  ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఆహార వ్యర్థం కావడాన్ని తగ్గించడం మరియు దేశంలో మరియు విదేశంలో ఆకలితో అలమటించే  ప్రజలకు భోజనం అందించాలనే లక్ష్యంతో ఈ పథకంను ప్రారంభించారు. .ప్రతి సంవత్సరం దేశంలో 4 బిలియన్ల దిర్హామ్ ల విలువ చేసే ఆహార వ్యర్థాలు సక్రమంగా వినియోగింప బడనున్నాయిని ప్రాజెక్ట్ అంచనా వేసింది. దశలలో పేదవాళ్లకు ఆ ఆహారాన్ని అందచేయగా , ఆ తర్వాత  సోమాలియా వంటి పేద దేశాలకు పంపిణీ చేయనున్నారు. దుబాయ్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ నాజర్ లూత  అధికారికంగా ఆహార బ్యాంకు లను లాఅంఛనంగా ప్రారంభించారు. రెండు శీతలీకరించిన కంటైనర్లు, పొడి ప్యాక్ డబ్బాల ఆహారము నిల్వ చేయడానికి అక్కడ అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com