అరుణాచల్ ప్రదేశ్ లో చైనా మరో దుశ్చర్య
- April 19, 2017
చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. ఇండియాలోని ప్రాంతాలకు పేర్లు ప్రమాణీకరించి దుస్సాహసానికి ఒడిగట్టింది. అరుణాచల్ ప్రదేశ్ లోని ఆరు పట్టణాలకు అధికారికంగా తమ పేర్లు పెట్టి భారత్ తో కయ్యానికి కాలు దువ్వింది. అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ గా పేర్కొంటూ ఈ దురాగతానికి దిగింది. ఈ మేరకు ఏప్రిల్ 14న పౌర వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీచేసినట్టు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా.. అరుణాచల్ పర్యటనను నిరసిస్తూ భారత దౌత్యవేత్తకు సమన్లు పంపిన 9 రోజుల తర్వాత చైనా ఈ చర్యకు పూనుకుంది.
దక్షిణ టిబెట్ లో తన భౌగోళిక సారభౌమత్వాన్ని పునరుద్ఘాటించేందుకే అరుణాచల్ ప్రదేశ్ లోని 6 పట్టణాల పేర్లను ప్రమాణీకరించినట్టు చైనా మేధావులు పేర్కొంటున్నారు. చైనా, టిబెట్, రోమన్ అక్షరాలతో ఈ పేర్లు పెట్టింది. వొగ్యలిన్ లింగ్, మిలా రీ, ఖ్యోడెన్గార్బొ, మాణిఖ్వా, బుమొలా, నామకాపబ్ రీ అనే పేర్లు ఖరారు చేసింది. అయితే ఈ పేర్లు పూర్వకాలం నుంచే ఉన్నాయని.. అప్పట్లో వీటిని ప్రమాణీకరించలేదని, ఇదంతా చైనా కుట్ర అని టిబెట్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ పరిశోధకుడు గుయొ కెఫాన్ తెలిపారు.
చైనా-భారత్ సరిహద్దులో 3,488 కిలోమీటర్ల మేర వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) ఉంది. అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ గా పేర్కొంటూ అది తమదేనని ఎప్పటినుంచో చైనా వాదిస్తోంది. 1962 యుద్ధ సమయంలో కొన్ని ప్రాంతాలకు డ్రాగన్ ఆక్రమించింది. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ఇరుదేశాల మధ్య 19 సార్లు ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. తాజాగా దలైలామా పర్యటన నేపథ్యంలో చైనా మరోసారి దుశ్చర్యకు దిగింది.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









